అవకాశాల కోసం ఏడ్చిన హీరోయిన్

Published on Dec 19,2019 11:45 AM

సినిమా హీరోయిన్ అవకాశాల కోసం సినిమా వేదిక మీదే ఏడవడం సంచలనంగా మారింది. దాంతో షాక్ అవ్వడం అందరి వంతు అయ్యింది. ఈ సంచలన సంఘటన '' అతడే శ్రీమన్నారాయణ '' అనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. ఇంతకీ స్టేజ్ పైనే ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా ...... ''శాన్వి శ్రీవాస్తవ ''. ఆది సాయికుమార్ హీరోగా నటించిన లవ్లీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది శాన్వి శ్రీవాస్తవ. ఆ సినిమా మంచి హిట్ కావడంతో వెంటనే కొన్ని సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి అయితే అడ్డా , రౌడీ అనే చిత్రాలతో పాటుగా మిగతా చిత్రాలు కూడా ప్లాప్ కావడంతో పాపం ఈ భామకు మళ్ళీ ఛాన్స్ లు రాలేదు.

దాంతో కన్నడ , మలయాళ , తమిళ సినిమాల్లో ఛాన్స్ లకోసం ప్రయత్నించింది. అక్కడ ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు , వచ్చిన ఒకటి రెండు సినిమాలు కేసుల సక్సెస్ కాలేదు దాంతో కెరీర్ అగమ్యగోచరంగా తయారయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు అతడే శ్రీమన్నారాయణ అనే చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దమైన నేపథ్యంలో నాకు అవకాశాలు ఇవ్వండి మహాప్రభో అంటూ స్టేజ్ పైనే ఏడ్చింది పాపం. హీరోయిన్ గా వచ్చాను కదా ! కెరీర్ బాగుంటుందని అనుకొని ఉంటుంది కానీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాపం ఇలా బాధపడుతోంది.