విజయ్ దేవరకొండ సరసన మరో హీరోయిన్

Published on Dec 24,2019 06:14 PM

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నలుగురు హీరోయిన్ లు రాశి ఖన్నా , కేథరిన్ ట్రెసా , ఐశ్వర్య రాజేష్ , ఇసా బెల్లా లతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందనుంది ఫైటర్ చిత్రం. పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా ఫైటర్ కావడంతో పాటు హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తుండటంతో ఈ సినిమాకు ఎనలేని క్రేజ్ వచ్చింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని ఎంపిక చేసారు. అయితే ఈ సినిమాలో జాన్వీ ఒక్క హీరోయిన్ మాత్రమే కాదట ! మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు పూరి జగన్నాధ్ , ఛార్మి లు. ముంబైలో పలు రకాల మోడల్స్ ని చూస్తున్నారట పూరి , ప్రస్తుతం ముంబైలో ఉన్నారు పూరి , ఛార్మి. సెకండ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. విజయ్ దేవరకొండ సరసన నటించడానికి జాన్వీ కపూర్ నటించడానికి ఉత్సాహపడుతోంది. ఇక ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు కనువిందు అన్నమాటే !