కోర్టులో లొంగిపోయిన హీరో విశాల్

Published on Aug 29,2019 11:40 AM

హీరో విశాల్ కోర్టులో లొంగిపోయాడు నిన్న. చెన్నై ఎగ్మూర్ కోర్టులో హీరో విశాల్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే అయితే ఆ బ్యానర్ లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి టీడీఎస్ ని సుమారు 4 కోట్ల వరకు చెల్లించకపోవడంతో ఇన్ కం టాక్స్ అధికారులు పలుమార్లు విశాల్ కు నోటీసులు జారీ చేసిన ఫలితం లేకపోవడంతో చెన్నై లోని ఎగ్మూర్ కోర్టులో ఫిర్యాదు చేసారు. 
దాంతో విశాల్ కు పలుమార్లు నోటీసులు జారీ చేసారు , ఇక్కడ కూడా కోర్టుకి విశాల్ హాజరుకాలేదు దాంతో ఆగ్రహించిన కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆగ్రహంతో విశాల్ నిన్న కోర్టులో లొంగిపోయాడు . అయితే వెంటనే విచారణ చేపట్టకుండా 2 గంటల తర్వాత విచారణ చేసారు.