మహేష్ బాబు రికార్డ్ బద్దలైంది

Published on Feb 13,2019 04:33 PM

మహేష్ బాబు రికార్డ్ ని బద్దలు కొట్టాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ . మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం నైజాం ఏరియాలో 22 కోట్ల 34 లక్షల షేర్ వసూల్ చేసింది ఫుల్ రన్ లో  రికార్డ్ ని వెంకటేష్  నెల రోజుల్లోనే బద్దలు కొట్టి 22 కోట్ల 47 లక్షల షేర్ వసూల్ చేసాడు ఎఫ్ 2 చిత్రంతో . సంక్రాంతి బరిలో జనవరి 12న ఎఫ్ 2 రిలీజ్ అయిన విషయం తెలిసిందే . 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - తమన్నా , వరుణ్ తేజ్ - మెహరీన్ లు జంటగా నటించిన ఎఫ్ 2 భారీ వసూళ్లు సాధిస్తోంది . ఇప్పటికి కూడా మంచి వసూళ్ల ని రాబడుతూ 76 కోట్ల షేర్ దాటిపోయింది . వెంకటేష్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది ఎఫ్ 2 . నైజాం లో ఎఫ్ 2 జోరు మాములుగా లేదు మహేష్ బాబు శ్రీమంతుడు రికార్డ్ కూడా బద్దలై పోయింది ఎఫ్ 2 దెబ్బతో .