మజిలీ చిత్రంపై సుశాంత్ ఏమన్నాడంటే

Published on Apr 05,2019 11:57 AM

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మజిలీ చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే . అక్కినేని నాగచైతన్య , సమంత , దివ్యంకా కౌశిక్ , పోసాని , రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు . ఇక ఈ సినిమాని నిన్ననే అక్కినేని కుటుంబం కోసం స్పెషల్ గా షో వేశారు . మజిలీ చిత్రాన్ని చూసిన వాళ్లలో హీరో సుశాంత్ కూడా ఉన్నాడు . 

ఇక సుశాంత్ ఈ సినిమాని చూసి నాగచైతన్య ని సమంత ని పొగడ్తలతో ముంచెత్తాడు . చైతూ - సమంత లు తమ అద్భుత నటనతో కట్టి పడేశారని , అలాగే దర్శకులు శివ నిర్వాణ మజిలీ ని బాగా తెరకెక్కించారని పోస్ట్ చేసాడు . గోపిసుందర్ అందించిన పాటలు తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అంటూ కొనియాడాడు సుశాంత్ . ఇక ఈ సినిమాని చూసిన ఓవర్ సీస్ ప్రేక్షకులు కూడా ప్రశంసిస్తున్నారు .