హీరో సూర్య చిత్రాలను బ్యాన్ చేస్తారట

Published on Apr 27,2020 02:09 PM
తమిళ స్టార్ హీరో సూర్య చిత్రాలను తమిళనాట బ్యాన్ చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు తమిళనాడు థియేటర్ యాజమాన్య సంఘాలు. ఇలా వీళ్ళు హెచ్చరించడానికి కారణం ఏంటో తెలుసా ...... సూర్య నటించిన '' పొన్మగల్ వందాల్ '' చిత్రాన్ని థియేటర్ లలో రిలీజ్ చేయకుండా అమెజాన్ భారీ ఆఫర్ చేయడంతో అందులో విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య. థియేటర్ లలో విడుదల చేయకుండానే అమెజాన్ కు అమ్మడం ద్వారా థియేటర్ వాళ్లకు పెద్దమొత్తంలో నష్టం జరుగుతుందని అందుకే సూర్య చిత్రాలను బ్యాన్ చేస్తామని అంటున్నారు.

థియేటర్ లలో రిలీజ్ చేయకుండానే అమెజాన్ లో స్ట్రీమింగ్ కి ఒప్పుకోవడం ద్వారా మెల్లి మెల్లిగా మిగతా వాళ్ళు కూడా ఇలాగె అలవాటు పడితే మొత్తం థియేటర్ వ్యవస్థే నాశనం అవుతుందని దీని మీద చాలామంది ఆధారపడి ఉన్నారని వాళ్లంతా రోడ్డున పడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు థియేటర్ యాజమాన్య సంఘాలు. మరి వీళ్ళ నిర్ణయం పై సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.