క్యాన్సర్ తో చనిపోయిన హీరో చెల్లి

Published on Dec 09,2019 02:31 PM

బాలీవుడ్ హీరో , విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చెల్లెలు శ్యామా తాంశీ సిద్దిఖీ (26) బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోయింది. దాంతో  ఈ విషయాన్నీ నవాజుద్దీన్ సిద్దిఖీ స్వయంగా వెల్లడించాడు. బ్రెస్ట్ క్యాన్సర్ తో తొమ్మిదేళ్లుగా పోరాడుతోంది నా చెల్లి , అయితే ఎట్టకేలకు మృత్యువు ముందు తలొంచాల్సి వచ్చిందని దుఃఖాన్ని దిగమింగుతూ ట్వీట్ చేసాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఏడేళ్లుగా శ్యామా తాంశీ సిద్దిఖీ కి వైద్యం చేసిన డాక్టర్ లకు కృతఙ్ఞతలు తెలిపాడు ఈ హీరో.

బాలీవుడ్ లో విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. అయితే తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలు బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోవడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు. చెల్లెలు అంత్యక్రియలను స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్ లోని బుధానా లో నిన్న నిర్వహించారు.