హీరో రామ్ కు గాయాలు

Published on Dec 27,2019 04:58 PM

యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కు గాయాలు అయ్యాయి. యాక్షన్ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఈ గాయాలు అయ్యాయి అయితే ఆ గాయాలు నాకు తీపి గుర్తులు తప్ప బాధించేవి కావంటూ తన కష్టాన్ని , ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ హీరో. తాజాగా రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాని యాక్షన్ సీక్వెన్స్ ని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ రూపొందిస్తున్నాడు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీక్వెన్స్ అంటే అదిరిపోయే రేంజ్ లో ఉంటాయన్న విషయం తెలిసిందే. పైగా తాను అనుకున్న విధంగా రావడానికి హీరోలను , ఫైటర్ లను బాగా కష్టపెడుతుంటాడు కూడా.

అలాగే రామ్ ని చాలా కష్టపెట్టాడట , దాంతో తన శరీరానికి గాయాలు అయ్యాయని వాటిని చూపిస్తూ తన బాధని వ్యక్తం చేసాడు. అయితే ఈ గాయాలు అయినప్పటికీ తనకు ఇబ్బంది లేదని ఓ మంచి సినిమా కోసం మా తపన అంటూ ఓ వీడియో ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసాడు. కిషోర్ తిరుమల - రామ్ కాంబినేషన్ లో వచ్చిన నేను శైలజ సూపర్ హిట్ అయ్యింది దాని తర్వాత ఉన్నది ఒకటే జిందగీ కూడా వచ్చింది. ఇక ఇపుడు ముచ్చటగా మూడో సినిమా ఈ కాంబినేషన్ లో వస్తోంది మరి. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు.