అమ్మాయిలకు బంపర్ ఆఫర్ ఇస్తున్న రామ్

Published on Feb 13,2019 04:20 PM

హీరో రామ్ అందమైన అమ్మాయిలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు . తనని కలవాలని ఆశపడే అభిమానులను అందునా అమ్మాయిలను మాత్రమే రేపు కలవనున్నాడు అయితే అందుకు అమ్మాయిలు ఏం చేయాలో తెలుసా ....... ఇస్మార్ట్ శంకర్ ని ఇంప్రెస్ చేసేలా తమ ప్రేమని వ్యక్తం చేయాలి . ఎవరు ఎంత బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళ లోంచి ఓ ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేస్తారు . 

అలా ఎంపిక చేసిన వాళ్ళని ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ లో రామ్ ని కలిసేలా ప్లాన్ చేస్తున్నారు . ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ ఇస్మార్ట్ శంకర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . రేపు ప్రేమికుల దినోత్సవం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఆఫర్ ఇస్తున్నాడు రామ్ . మరింకెందుకు ఆలస్యం వెంటనే రామ్ కు ప్రపోజ్ చేయండి అమ్మాయిలు .