కరోనా: చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో నిఖిల్

Published on Apr 16,2020 06:47 PM
చైనా పై సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో నిఖిల్. కరోనా మహమ్మారిని కావాలనే ప్రపంచం మీదకు వదిలింది చైనా అంటూ నేరుగా చైనా పై ఆరోపణలు గుప్పిస్తున్నాడు నిఖిల్. కావాలనే దురుద్దేశంతోనే చైనా ఇలా చేసిందని అందుకు సాక్ష్యం ...... వుహాన్ లో పుట్టిన కరోనాని బాహ్య ప్రపంచానికి అంటించాలనే చైనాలో డొమెస్టిక్ ఫ్లయిట్ లను రద్దు చేసి అంతర్జాతీయ విమానాలను మాత్రం నడిపిందని దాని వల్ల కరోనా ప్రపంచ వ్యాప్తం అయ్యిందని ఆరోపిస్తున్నాడు.

వుహాన్ లో కరోనా వైరస్ పుట్టినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈరోజు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడేవా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు నిఖిల్. అమెరికా ఈ విషయాన్నీ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. చైనా ఏదో మాయ పన్నినట్లు ఉందని అందుకే కరోనా వాళ్ళ దేశంలో తగ్గుముఖం పట్టిందని కానీ ఇతర దేశాలు తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.