ఫలక్ నుమా దాస్ హీరోతో నాని

Published on Oct 24,2019 05:49 PM

ఫలక్ నుమా దాస్ చిత్రంతో హీరో కమ్ డైరెక్టర్ గా సత్తా చాటిన విశ్వక్ సేన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు హీరో నాని. హీరోగా మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు నాని అయినప్పటికీ చిత్ర నిర్మాణం పట్ల ఉత్సాహం చూపుతూ '' అ '' చిత్రాన్ని నిర్మిస్తూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు రెండో చిత్రానికి పూనుకున్నాడు నాని. విశ్వక్ సేన్ ని హీరోగా పెట్టి '' హిట్ '' అనే చిత్రానికి శ్రీకారం చుట్టాడు నాని. ఈరోజు ప్రారంభమైంది '' హిట్ '' చిత్రం. ఒక హీరో మరో హీరో ని పెట్టి సినిమా తీయడం విశేషమే మరి. ఫలక్ నుమా దాస్ చిత్రంతో సంచలనం సృష్టించిన విశ్వక్ సేన్ కు ఇది నిజంగా మరో గొప్ప అవకాశమే అని చెప్పాలి.