లాక్ డౌన్ తుంగలో తొక్కి పెళ్లి చేసుకున్న హీరో

Published on Apr 18,2020 03:11 PM
కరోనా ఎఫెక్ట్ తో దేశమంతా లాక్ డౌన్ లో ఉంటే కన్నడ హీరో నిఖిల్ గౌడ మాత్రం లాక్ డౌన్ ని తుంగలో తొక్కి పెళ్లి చేసుకున్నాడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు , మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవేగౌడ మనవడు అయిన నిఖిల్ గౌడ హీరోగా జాగ్వార్ చిత్రంతో పరిచయం అయ్యాడు. తెలుగు , కన్నడ , తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందింది. అయితే అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఈరోజు ఉదయం బెంగుళూర్ సమీపంలో ఉన్న కుమారస్వామి ఫామ్ హౌజ్ లో నిఖిల్ - రేవతి ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కనీసం 200 మంది వరకు ఈ పెళ్ళికి హాజరైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజువల్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ లో ఎక్కడ కూడా లాక్ డౌన్ నియమ నిబంధనలను పాటించినట్లు కనబడటం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో జనాలు దగ్గరగా ఉండకూడదని , పెళ్లిళ్లు వద్దని ఒకవేళ చేసుకుంటే తక్కువ మంది సమక్షంలో చేసుకోవాలని అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలని కండీషన్స్ పెట్టారు. కానీ ఒక్క కండీషన్ కూడా వీళ్ళు పాటించలేదు.