ఆ హీరో హిట్ కొట్టినట్లేనా !

Published on Oct 25,2019 04:49 PM

తమిళ హీరో కార్తీ తాజాగా ఖైదీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. గతకొంత కాలంగా కార్తీ కి సరైన హిట్స్ లేకుండాపోయాయి దాంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు పాపం. ఇక తెలుగులో అయితే కార్తీ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. తమిళ్ లో కార్తీ సినిమాలు ఎంతో కొంత పే చేస్తున్నాయి కానీ తెలుగులో మాత్రం పూర్తిగా నిరాశ పరచడమే కాకుండా బయ్యర్లను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.

దాంతో కార్తీ మార్కెట్ తెలుగులో పూర్తిగా పడిపోయింది. అలాంటి సమయంలో వచ్చిన ఖైదీ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. సీరియస్ గా సాగే ఖైదీ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. అయితే కార్తీ గత సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు కాబట్టి పెద్దగా ఓపెనింగ్స్ లేకుండా పోయాయి . అయితే టాక్ బాగుంది కాబట్టి వసూళ్లు మెరుగు పడతాయేమో చూడాలి.