తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పిన హీరో

Published on Apr 29,2020 06:05 PM
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పాడు. మలయాళ హీరో అయిన దుల్కర్ తమిళ ప్రజలకు ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందో తెలుసా ........ ఇటీవల దుల్కర్ సల్మాన్ '' వారణే అవశ్యముండే '' చిత్రంలో నటించాడు. శోభన , సురేష్ గోపి , కళ్యాణి ప్రియదర్శన్ , దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. ఆ సినిమా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. అయితే సినిమాలో తమిళులకు ఆరాధ్యం అయినటువంటి ఎల్ టీటీఈ చీఫ్ ప్రభాకరన్ ను అవమానించేలా ఓ సన్నివేశం ఉందని తమిళులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

తమిళుల ఆగ్రహం గురించి విన్న దుల్కర్ తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పాడు. మేము కావాలని ప్రభాకరన్ ని అవమానించేలా ఆ సన్నివేశం పెట్టలేదు 1988 లో వచ్చిన పట్టణ ప్రవేశం చిత్రం లోని సన్నివేశాన్ని అనుసరించాం కానీ అది ఇలా బెడిసి కొట్టింది అందుకు సారీ అంటూ ట్వీట్ చేసాడు. అంతేకాదు నన్ను , నాతో పాటుగా మా కుటుంబాన్ని అలాగే ఇతర సీనియర్ నటీనటులను కూడా విమర్శిస్తున్నారు దయచేసి అలాంటి విమర్శలు చేయొద్దు అంటూ కోరుతున్నాడు దుల్కర్ సల్మాన్. ఎల్ టీటీ ఈ అధినేత ప్రభాకరన్ చనిపోయి చాలాకాలం అవుతున్నా అతడు అంటే మాత్రం తమిళ ప్రజలకు ఎనలేని గౌరవం.