వ్యభిచారం కేసులో హీరోయిన్లు

Published on Dec 05,2019 08:18 PM

కన్నడ హీరోయిన్ లు ముగ్గురు వ్యభిచారం కేసులో ఇరుక్కోనున్నరా ? అంటే అవుననే అంటున్నాయి కర్ణాటక పోలీస్ వర్గాలు. కర్ణాటకలో రాజకీయ వర్గాలను భయబ్రాంతులకు గురిచేస్తున్న స్కామ్ '' హానీ ట్రాప్ '' కేసు. కర్ణాటకలో రాజకీయ నాయకులను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటనలో పలువురు మాజీ మంత్రులు , ఎం ఎల్ ఏ లు , వివిధ హోదాలలో పనిచేస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారట. పైగా పలువురు రాజకీయ నాయకులు ముగ్గురు హీరోయిన్ లతో శృంగారంలో పాల్గొన్న సమయంలో తీసిన వీడియోలు బహిర్గతం అయ్యాయి.

ఆ వీడియోలలో ముగ్గురు హీరోయిన్ లు ఉన్నారు అయితే వాళ్ళు కాస్త అస్పష్టంగా ఉండటంతో ముందుగా వాళ్ళని విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేయాలా ? లేక సమన్లు జారీ చేయాలా అనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న హానీ ట్రాప్ కేసు రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.