గర్భవతి అయిన హీరోయిన్

Published on Apr 16,2020 06:42 PM

హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ గర్భవతి అయ్యింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది అని అనుకుంటున్నారా ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ ని కొద్దిలో మిస్ చేసుకుంది ఈ భామ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో మొదట హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ ని ఎంపిక చేసారు పవన్ . అయితే ఆమె ఎంపిక పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు.

అయితే ఆ ఛాన్స్ మిస్ అయినప్పటికీ తన గోపాల గోపాల చిత్రంలో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ ఛాన్స్ అనీషా ఆంబ్రోస్ కు అంతగా ఉపయోగపడలేదు పాపం దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మూడు నెలల గర్భవతి. అనీషా ఆంబ్రోస్ కు తేజస్వి ఫ్రెండ్ దాంతో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.