మహేష్ బాబు చేతిలో హలో యాప్

Published on Feb 04,2020 07:53 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. టాలీవుడ్ లో ఎక్కువ బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నది మహేష్ బాబు ఒక్కడే అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మహేష్ చేతిలో మరో యాప్ చేరింది. ఇంతకీ మహేష్ కొత్తగా అంగీకరించిన యాప్ ఏంటో తెలుసా ........ హలో యాప్. ఈ యాప్ ఫేమస్ అన్న విషయం తెలిసిందే.

మరింత ప్రాచుర్యం పొందాలంటే మహేష్ బాబు లాంటి హీరో అయితే బాగుంటుందని సంప్రదించడం మహేష్ ఒప్పుకోవడం జరిగిపోయింది. తాజాగా మహేష్ బాబు తన ఇన్ స్టా గ్రామ్ లో హలో కు సంబందించిన యాప్ గురించి చెబుతూ దాన్ని డౌన్ లోడ్ చేసుకోండని కోరుతున్నాడు. మహేష్ బాబు కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అలాగే సోషల్ మీడియాలో కూడా ఎక్కువే ! దాంతో ఈ యాప్ ఇంకా వైరల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.