విలన్ గా హెబ్బా పటేల్

Published on Sep 07,2019 02:18 PM

హాట్ భామ హెబ్బా పటేల్ విలన్ గా నటించడానికి సిద్ధమైంది. హీరో నితిన్ నటిస్తున్న భీష్మ చిత్రంలో విలన్ గా హెబ్బా పటేల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు అందాల ఆరబోతకు మాత్రమే పరిమితమైన హెబ్బా పటేల్ కు నిజంగా ఇది గోపా ఛాన్స్ అనే చెప్పాలి. ఛలో వంటి సూపర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల దర్శకత్వంలో బీష్మ చిత్రం రూపొందుతోంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ నెగెటివ్ క్యారెక్టర్ పోషిస్తుండటంతో భీష్మ పై అంచనాలు పెరిగాయి. నితిన్ కూడా కొంత గ్యాప్ తీసుకొని కసిగా చేస్తున్న చిత్రం ఈ భీష్మ. హెబ్బా పటేల్ గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు అలాంటిది ఈ సినిమాతో కాస్త నటనకు అవకాశం ఉన్న పాత్ర పోషిస్తుండటంతో సంతోషంగా ఉంది.