రొమాంటిక్ సినిమాలో హాట్ భామ

Published on Mar 07,2019 12:38 PM

హాట్ భామ హెబ్బా పటేల్ తాజాగా ఓ రొమాంటిక్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . కుమారి 21 F  చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ భామకు ఆ సినిమా మంచి బ్రేక్ నిచ్చింది అలాగే క్రేజ్ తెచ్చిపెట్టింది దాంతో వరుసగా బోలెడు ఆఫర్లు వచ్చి పడ్డాయి . అయితే కుమారి 21 f , ఈడోరకం ఆడోరకం హిట్స్ తప్ప మిగతా సినిమాలన్నీ ప్లాప్ కావడంతో క్రేజ్ పోయింది . దాంతో అవకాశాలు లేకుండాపోయాయి . 

కట్ చేస్తే తాజాగా ఓ బోల్డ్ మూవీలో ఈ భామకు ఛాన్స్ వచ్చింది . బోల్డ్ మూవీలో నటించడం అంటే ఈ భామకు తెగ ఆరాటం అందుకే వెంటనే అంగీకరించిందట . ప్రిన్స్ హీరోగా నటించనున్న ఆ చిత్రానికి రాడికల్ అనే టైటిల్ ని పెట్టారు . హెబ్బా పటేల్ కూడా రాడికలే కదా ! బోల్డ్ గా నటించడంలో . మరి ఈ సినిమా తోనైనా హెబ్బా పటేల్ హిట్ కొడుతుందో చూడాలి .