నటికి గుండెపోటు పరిస్థితి విషమం

Published on Nov 23,2019 06:36 PM

మోడల్ , నటి , ఐటెం గర్ల్ గేహానా వశిష్ట కు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉందని , ఎప్పుడు మెరుగు అవుతుందో చెప్పలేమని అంటున్నారు డాక్టర్లు. 31 ఏళ్ల  గేహానా వశిష్ఠ మోడల్ గా , నటిగా , ఐటెం గర్ల్ గా తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది. అయితే ఆశించిన స్థాయిలో కెరీర్ ముందుకు సాగలేదు. తాజాగా ఈ భామ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఆ వెబ్ సిరీస్ కోసం ఏకంగా 48 గంటల పాటు ఆహారం తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంది.

అసలే లో బీపీ , షుగర్ ఉన్న గేహానా వశిష్ఠ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటు రావడంతో కష్టం మీద చికిత్స అందిస్తున్నారు. 48 గంటల పాటు ఆహారం తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొనడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని , ఆమె కండీషన్ గురించి ఇప్పుడే ఏమి చెప్పలేమని తేల్చారు డాక్టర్లు. తెలుగులో ఆపరేషన్ దుర్యోధన , బిటెక్ లవ్ స్టోరీ తదితర చిత్రాల్లో నటించింది గేహానా వశిష్ఠ.