రూమర్లని ఖండించిన హరీష్ శంకర్

Published on Feb 04,2020 08:07 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మళ్ళీ హరీష్ శంకర్ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రీమేక్ అంటూ ఓ మీడియాలో కథనం రావడంతో సదరు మీడియా సంస్థకు గట్టిగానే సమాధానం ఇచ్చాడు దర్శకులు హరీష్ శంకర్. మేము ఎలాంటి రీమేక్ చేయబోవడం లేదు , తెలుగు స్ట్రైట్ ఫిలిం చేస్తున్నాం దానికి సంబందించిన అన్ని వివరాలు తెలియజేస్తాను అంటూ గట్టిగానే ఇచ్చాడు హరీష్ శంకర్.

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటించగానే సెన్సేషన్ అయ్యింది. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతున్నందుకు. రీ ఎంట్రీలో పవన్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడు సినిమాలు ఒప్పుకోగా ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక గబ్బర్ సింగ్ రీమేక్ కాగా ఇప్పుడు మాత్రం రీమేక్ కాదట.