హన్సిక ఫోన్ హ్యాక్ చేసి ఫోటోలు లీక్ చేసారు

Published on Jan 24,2019 05:55 PM

అందాల భామ హన్సిక ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండటంతో తన ఫోన్ హ్యాక్ అయ్యిందని అంటోంది హన్సిక . నా ట్విట్టర్ ఖాతా నుండి ఆ ఫోటోలు పంపిస్తున్నారని వాటికి అభిమానులు స్పందించద్దని కోరుతోంది . ఇటీవలే హన్సిక టు పీస్ బికినిలో దిగిన ఫోటోలు లీక్ అయ్యాయి . దాంతో అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా తీవ్ర షాక్ కి గురయ్యారు . 

అయితే ఫోన్ హ్యాక్ కావడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇస్తోంది హన్సిక . నిజమే కావచ్చు కానీ హన్సిక ప్రైవేట్ ఫోటోలు లీక్ కావడంతో దుమారం చెలరేగింది . హన్సిక ప్రస్తుతం మహా అనే చిత్రంలో నటిస్తోంది . ఇది తనకు యాభయ్యవ చిత్రం కావడం విశేషం . మహా చిత్రం కూడా పలు వివాదాల్లో చిక్కుకుంది . ఫస్ట్ లుక్ , సెకండ్ లుక్ , తర్డ్ లుక్ లతో వివాదాన్ని రాజేసింది హన్సిక . ఇక ఇప్పుడేమో ఫోటోలు లీక్ అయి షాక్ ఇస్తోంది .