విరహం తట్టుకోలేకపోతున్న గుత్తా జ్వాల

Published on Mar 30,2020 11:30 PM
బ్యాడ్మింటన్ భామ గుత్తా జ్వాల విరహంతో తట్టుకోలేకపోతోంది. అసలే కరోనా వైరస్ ప్రభావంతో ఎవరూ ఇంటి నుండి బయటకు వెళ్లలేకపోతున్నారు. దాంతో 24 గంటల పాటు ఇంట్లోనే ఉండాలంటే బోర్ కొడుతోంది అందరికీ. ఇలాంటి సమయంలో కోరుకున్న ప్రియుడు పక్కనే ఉంటే అతడితో ముచ్చట్లు చెప్పుకుంటూ సరస శృంగార కార్యకలాపాలలో తేలినట్లైతే విరహ తాపం తీరేది కానీ ఏ ఛాన్స్ లేకుండాపోయింది పాపం ఈ భామకు.

ఎందుకంటే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో బయటకు వెళ్ళడానికి వీలు లేకుండాపోయింది. గతకొంత కాలంగా తమిళ హీరో విష్ణు విశాల్ తో ఈ భామ సహజీవనం చేస్తోంది. అయితే లాక్ డౌన్ కు ముందు చెన్నై నుండి హైదరాబాద్ వచ్చింది గుత్తా జ్వాల. ఇక హైదరాబాద్ లోనే ఒంటరిగా ఉండిపోయింది పాపం. దాంతో విష్ణు విశాల్ ని మిస్ అవుతున్నట్లు ప్రకటించింది గుత్తా జ్వాల. దానికి విష్ణు విశాల్ కూడా స్పందించాడు ఈ పరిస్థితిలో తప్పదు మరి అని.