సహజీవనం చేస్తున్న గుత్తా జ్వాల

Published on Jan 02,2020 06:17 PM
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తమిళ హీరో విష్ణు విశాల్ తో సహజీవనం చేస్తోంది. అయితే ఇన్నాళ్లు అబ్బే ! మామధ్య అలాంటిదేమి లేదని చెబుతూ వచ్చిన ఈ భామ తాజాగా విష్ణు విశాల్ తనకు ముద్దు పెడుతున్న , కౌగిలించుకుంటున్న స్టిల్స్ ని సోషల్ మీడియాలో పెట్టేసి అందరికీ షాక్ ఇస్తోంది. గతకొంత కాలంగా విష్ణు విశాల్ తో సహజీవనం చేస్తోంది ఈ హాట్ భామ. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదో సాగుతోందని పుకార్లు షికారు చేసినప్పుడు వాటిని ఖండించి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పిన గుత్తా జ్వాల తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు చూసి నిర్దారణకు వచ్చారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన గుత్తా జ్వాల తన సహచరుడు చేతన్ ఆనంద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆరేళ్ళ కాపురం తర్వాత ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులకు క్రికెటర్అజారుద్దీన్ కారణం అని అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా విష్ణు విశాల్ తో కలిసి ఉంటోంది ఈ హాట్ భామ. విష్ణు విశాల్ కు కూడా పెళ్లి అయ్యింది కానీ గుత్తా జ్వాల పరిచయంతో భార్యని విడిచి పెట్టాడు ఈ హీరో. ఇంకేముంది ఇద్దరూ ఇలా విరహతాపాన్ని తీర్చుకుంటున్నారు.