గిల్టీ ట్రైలర్ యమా హాట్ గురూ !

Published on Feb 18,2020 07:28 PM

హాట్ భామ కియారా అద్వానీ ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించి కియారా అద్వానీ అందరిని షాక్ అయ్యేలా చేసింది. కోరికలతో రగిలిపోయే గృహిణిగా కియారా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు గిల్టీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ కూడా సంచలనం సృష్టించేలా కనబడుతోంది. ఎందుకంటే ఇందులో కియారా అద్వానీ యమా హాట్ గా ఉంది.

మోడ్రన్ లుక్ లో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా కనిపిస్తోంది కియారా. ఇక ఈ వెబ్ సిరీస్ ఒక రేప్ చుట్టూ తిరగడం విశేషం. అయితే రేప్ చేసిన వాళ్ళు ఎవరు ? రేప్ కు గురైంది ఎవరు ? అన్నది ఆసక్తికరంగా మారింది. సస్పెన్స్ ఎలిమెంట్ తో తెరకెక్కిన గిల్టీ వెబ్ సిరీస్ మార్చి 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ తో సంచలనం సృష్టించిన కియారా తాజాగా గిల్టీ తో కూడా సంచలనం సృష్టించేలా కనబడుతోంది.