లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ అధికారుల దాడి

Published on Dec 22,2019 09:11 AM

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడులు చేయడంతో వణికిపోయిన ఆ హీరోయిన్ వెంటనే షూటింగ్ రద్దు చేసుకొని ఇంటికి చేరుకుంది. లావణ్య త్రిపాఠి లక్షల్లో జీఎస్టీ ని ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారట దాంతో ఆమె ఇంటి పై దాడి చేసారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోగల లావణ్య త్రిపాఠి ఇంటిపై దాడి చేసి అన్ని డాక్యుమెంట్ల ని స్వాధీనం చేసుకొని హీరోయిన్ గా నటిస్తున్నప్పటి నుండి అన్ని వివరాలను రాబడుతున్నారు.

జీఎస్టీ అధికారులు ఇంటి పై దాడులు చేయడంతో పాపం భయపడిపోయిందట లావణ్య. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో పాటుగా పలువురు సినీ ప్రముఖుల ఇళ్ల పై కూడా దాడులు నిర్వహించారు అధికారులు. జీఎస్టీ అధికారుల దాడులు జరిగాయని తెలియడంతో పలువురు సినిమా వాళ్ళు భయపడిపోయారట. మొత్తానికి జీఎస్టీ అధికారుల దాడులతో ఫిలింనగర్ దద్దరిల్లిపోయింది.