రజనీకాంత్ సినిమాలో విలన్ గా గోపీచంద్

Published on Mar 05,2020 02:30 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా శివ దర్శకత్వంలో రజనీకాంత్ '' అన్నాతే '' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ అనే దర్శకుడు మొదట తెలుగులోనే గోపీచంద్ హీరోగా వచ్చిన శౌర్యం , శంఖం చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత తనకు అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళబాట పట్టాడు కట్ చేస్తే అక్కడ పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

ఆల్రెడీ శివ - గోపీచంద్ లు కలిసి పనిచేయడంతో ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడట శివ. రజనీకాంత్ సినిమాలో విలన్ గా నటించే గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడట శివ. రజనీకాంత్ సినిమా అంటే వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. అలాగే గోపీచంద్ వర్షం , జయం చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించడమే కాకుండా ప్రభుత్వ అవార్డులను సైతం దక్కించుకున్నాడు. పైగా గతకొంత కాలంగా గోపీచంద్ కు హీరోగా సక్సెస్ లు లేకుండాపోయాయి దాంతో ఈ ఆఫర్ కు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది.