ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త

Published on Jan 23,2019 03:39 PM

ప్రభాస్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తడానికి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్ . ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . అయిదేళ్ల కాలంలో కేవలం బాహుబలి , బాహుబలి 2 చిత్రాలను మాత్రమే విడుదల చేయడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తి కి గురయ్యారు . బాహుబలి వల్ల ఆలస్యం అయిందనుకుంటే ఇప్పుడు సాహో వల్ల ఇంకా ఆలస్యం అవుతుండటంతో వాళ్ళని సంతోష పరచడానికి ఈ ఏడాది తన రెండు సినిమాలను విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యాడట ప్రభాస్ . 

ప్రస్తుతం సాహో చిత్రం చేస్తుండగా దాన్ని ఆగస్టు లో రిలీజ్ చేయనున్నారు , అయితే సాహో అయ్యాక జాన్ అనే చిత్రాన్ని కూడా 2019 డిసెంబర్ లో విడుదల చేయాలనీ అనుకుంటున్నాడట ప్రభాస్ . జాన్ కూడా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది . నవంబర్ లోపు షూటింగ్ పూర్తి అవుతుంది కాబట్టి డిసెంబర్ లో జాన్ ని కూడా రిలీజ్ చేస్తారట . అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త అన్నట్లే కదా !