పరశురామ్ కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబు

Published on Dec 26,2019 05:25 PM

గీత గోవిందం చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్ కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తదుపరి చిత్రాన్ని చేసే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడట మహేష్ దాంతో సంతోషకరమైన ఆ విషయాన్నీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో వెల్లడించాడు దర్శకుడు పరశురామ్. మహేష్ బాబు తో సినిమా చేయాలనీ పరశురామ్ కు ఎప్పటి నుండో ఆశగా , కోరికగా ఉంది అయితే అది ఇన్నాళ్లకు నెరవేరుతుంది అందుకే దేవుడి సన్నిధిలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

గీత గోవిందం వంటి సూపర్ హిట్ అయిన తర్వాత పరశురామ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనీ భావించాడు కానీ కుదరలేదు. పైగా సమయం గడిచిపోతున్నప్పటికీ స్పష్టమైన ప్రకటన ఏది రాకపోవడంతో ఇక స్టార్ హీరోలు ఈ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చినట్లే అనుకున్నారు కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడని పేర్కొన్నాడు దర్శకులు పరశురామ్. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకొని ఆశీస్సులు పొందాడు పరశురామ్. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.