మందు తాగుతూ కంపెనీ ఇస్తున్న భామ

Published on Feb 12,2020 02:34 PM

మద్యం తాగొద్దు అని చెప్పాల్సిన భామ అతడికి కంపెనీ ఇవ్వడానికి నేను  సైతం అంటూ మందు కొడుతూ కంపెనీ ఇస్తోంది. ఇంతకీ ఇలా కంపెనీ ఇచ్చేది ఎవరో తెలుసా ....... రష్మిక మందన్న ఇక కంపెనీ తీసుకుంటోంది ఎవరో తెలుసా ...... నితిన్. అవును భీష్మ సినిమా కోసం ఇలా తెగబడ్డారు ఈ ఇద్దరూ. తాజాగా నితిన్ - రష్మిక మందన్న వైన్ ని గ్లాసులో పోసుకొని చీర్స్ కొడుతున్న స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ మందు తాగకుండానే కిక్ ఇచ్చేలా ఉంది.

నితిన్ హీరోగా నటించిన భీష్మ చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది దాంతో రకరకాల ప్రమోషన్ లు చేస్తున్నారు ఆ చిత్ర బృందం. రష్మిక మందన్న - నితిన్ ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో భీష్మ పై అంచనాలు భారీగానే పెరిగాయి. ఛలో వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకీ కుడుములకు ఇది రెండో చిత్రం కావడం గమనార్హం.