ప్రభాస్ సినిమా అప్ డేట్ ఇవ్వండి మహా ప్రభో !

Published on Nov 25,2019 11:39 AM

ప్రభాస్ నటించిన సాహో విడుదలై అప్పుడే మూడు నెలలు దాటుతోంది ఇప్పటివరకు తదుపరి సినిమా షూటింగ్ ఏం జరుగుతోంది ? ఎక్కడ జరుగుతోంది అన్నది వివరాలు ఏమి ఇవ్వలేదు ఇంతవరకు దాంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు మా ప్రభాస్ సినిమా అప్ డేట్ ఇవ్వండి మహా ప్రభో అంటూ. సాహో డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరాశతో ఉన్నారు.

కనీసం తదుపరి సినిమా ఎప్పుడు మొదలు కాబోతోంది ? అది స్టేజ్ లో ఉంది అన్న వివరాలు కావాలని అడుగుతున్నారు కానీ ప్రభాస్ నుండి కానీ జాన్ చిత్ర దర్శక నిర్మాతల నుండి కానీ ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా ప్రభాస్ జాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ , గోపికృష్ణ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. జాన్ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా సెట్లు వేస్తున్నారు. అక్కడే షూటింగ్ జరగనుంది.