మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్న సంకల్ప్ రెడ్డి

Published on Feb 25,2019 04:05 PM

ఘాజి చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులను కూడా గెలుచుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి . మొదటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ దర్శకుడు తాజాగా మరో సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు . ఘాజి తర్వాత అంతరిక్షం అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు అయితే ఆ సినిమా పరాజయం పాలయ్యింది దాంతో షాక్ తిన్న ఈ యువ దర్శకుడు కొంత గ్యాప్ తీసుకొని మరో సినిమాకు సిద్ధం అవుతున్నాడు . 

అయితే ఈ మూడో ప్రయత్నం కూడా ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడట ! అంటార్కిటికా పరిశోధనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది . అంతరిక్షం దెబ్బ కొట్టినప్పటికీ మళ్ళీ ప్రయోగాత్మక చిత్రానికే మొగ్గు చూపుతున్నాడు సంకల్ప్ రెడ్డి .