గీత గోవిందం డైరెక్టర్ కు చుక్కలు చూపించిన స్టార్ హీరోలు

Published on Nov 24,2019 06:17 PM

విజయ్ దేవరకొండ తో గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పటికీ పాపం పరశురామ్ అనే దర్శకుడికి ఏ స్టార్ హీరో కూడా ఛాన్స్ ఇవ్వలేదు దాంతో ఇప్పుడు అక్కినేని నాగచైతన్య తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గీత గోవిందం భారీ విజయం సాధించడంతో స్టార్ హీరోలతో సినిమా చేయాలనీ భావించాడు పరశురామ్. ఇక స్టార్ హీరోలు కూడా పరశురామ్ కు సమయం ఇచ్చారు కానీ కథ సెట్ కాలేదు కానీ పరశురామ్ మాత్రం ఆ హీరో ఛాన్స్ ఇస్తాడు .... ఈ హీరో ఛాన్స్ ఇస్తాడు అని ఎదురు చూసాడు పాపం ఈ దర్శకుడు కానీ కుదరలేదు.

మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , ప్రభాస్ ఇలా పెద్ద లిస్ట్ ఉంది పరశురామ్ హీరోలలో. అయితే గీత గోవిందం వచ్చి అప్పుడే ఏడాదిన్నర దాటడంతో ఇక చేసేది లేక అక్కినేని నాగచైతన్య తో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. స్టార్ హీరోల చుట్టూ తిరిగి లాభం లేకపోవడంతో చైతూ తో ఫిక్స్ అవుతున్నాడట పాపం. బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పటికీ స్టార్ హీరోలు కనికరించడం లేదన్న మాట.