ఆకట్టుకునేలా ఉన్న గ్యాంగ్ లీడర్ ట్రైలర్

Published on Aug 28,2019 12:51 PM

నాని హీరోగా నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్ ట్రైలర్ ఈరోజు విడుదల అయ్యింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13 న విడుదల కానుంది. ఇక ఈ ట్రైలర్ మాంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా సాలిడ్ గా యాక్షన్ తో కూడి ఉంది. అయిదుగురు మహిళల గ్యాంగ్ కు లీడర్ గా నాని మంచి ఫన్ క్రియేట్ చేసాడు దాంతో థియేటర్ లో నవ్వులు పూయించడం ఖాయంగా మారింది. 

ఇక ఈ చిత్రంలో నాని పాలిట విలన్ గా నటించింది ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా తెలుగుతెరకు పరిచయమైన కార్తికేయ గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటించాడు. నాని - కార్తికేయ మధ్య యాక్షన్ సీన్స్ కూడా అలరించేలా ఉన్నాయి . మొత్తానికి ట్రైలర్ తో గ్యాంగ్ లీడర్ పై అంచనాలు పెంచేలా చేసారు.