గ్యాంగ్ లీడర్ తో నాని హిట్ కొడతాడా ?

Published on Sep 09,2019 11:10 AM

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ ఈనెల 13 న విడుదల కాబోతోంది దాంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ ఓ ప్రభంజనం అయితే ఇన్నాళ్ల తర్వాత అదే టైటిల్ తో నాని వస్తున్నాడు అయితే ఇది పక్కా మాస్ చిత్రం కాదు మాస్ టచ్ ఉన్న క్లాస్ చిత్రం. దాంతో ఆ గ్యాంగ్ లీడర్ లా ఈ గ్యాంగ్ లీడర్ సంచలనం సృష్టించడం కష్టమే !
కాకపోతే నాని రేంజ్ హిట్ కొట్టొచ్చు సినిమా బాగుంటే. ఇప్పటివరకైతే విడుదలైన టీజర్ , ట్రైలర్ ల వల్ల నాని గ్యాంగ్ లీడర్ పై  మంచి అంచనాలే ఉన్నాయి. అయితే దర్శకులు  విక్రమ్ కే కుమార్ కు అంతగా సక్సెస్ లు లేవు ఈమధ్య కాలంలో. అపుడెపుడో తీసిన మనం మాత్రమే ఎవరు గ్రీన్ హిట్. ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆడలేదు దాంతో కొంతవరకు నీలినీడలు ఉన్నాయి నాని గ్యాంగ్ లీడర్ చిత్రంపై. అయితే సాహో డిజాస్టర్ అయిన వేళ నానికి తప్పకుండా గ్యాంగ్ లీడర్ కలిసి వస్తుందని అనుకుంటున్నారు. చూడాలి సెప్టెంబర్ 13 న ఏం తేలనుందో !