గబ్బర్ సింగ్ దర్శకుడితో మహేష్ బాబు

Published on Apr 18,2020 03:23 PM
గబ్బర్ సింగ్ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సమయం పడుతుంది అయినప్పటికి తన తదుపరి చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. ఇంతకీ ఈ దర్శకుడి తదుపరి హీరో ఎవరో తెలుసా ....... మహేష్ బాబు. అవును టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేయాలనీ తహతహలాడుతున్నాడు హరీష్ శంకర్.

మహేష్ బాబు కోసం ఓ లైన్ కూడా అనుకున్నాడట దాన్ని పక్కా స్క్రిప్ట్ గా రూపొందించే పనిలో పడ్డాడట. ఇప్పటికే మహేష్ బాబుని కలిసి తన మనసులో మాట చెప్పాడట హరీష్ శంకర్. స్క్రిప్ట్ పక్కాగా వస్తే తప్పకుండా చేద్దామని అభయం ఇచ్చాడట మహేష్ బాబు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ తో మళ్ళీ ఇన్నాళ్లకు కాంబినేషన్ సెట్ అయ్యింది కాబట్టి ప్రస్తుతం దాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు హరీష్ శంకర్.