లారెన్స్ పేరుతో ఘరానా మోసం

Published on Nov 28,2019 03:47 PM

నటుడు , నృత్య దర్శకుడు , దర్శకుడు రాఘవ లారెన్స్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది. రాఘవ లారెన్స్ తన పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాట  ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసాడు లారెన్స్ దాంతో అతడి పేరుని అడ్డంగా పెట్టుకొని మోసం చేయాలనీ పక్కా ప్లాన్ వేశారు అందుకే లారెన్స్ పేరిట ఓ వెబ్ సైట్ ని ఏర్పాటు చేసారు.

లారెన్స్ కు మంచి పేరు ఉండటంతో పాటుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అతడి పేరు అడ్డు పెట్టుకొని విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు ఇంకేముంది లారెన్స్ సహకరిస్తే మరిన్ని మంచి పనులు జరుగుతాయని భావించి చాలా చోట్ల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. అయితే ఈ విషయం లారెన్స్ దృష్టికి ఆలస్యంగా రావడంతో వెంటనే స్పందించి పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు. లారెన్స్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితె ఇవ్వొద్దని అంటున్నాడు లారెన్స్ కార్యదర్శి.