న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంభం

Published on Jan 21,2019 05:37 PM
బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది.  హిమ బిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో బాలు ద‌ర్శక‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సంద‌ర్భంగా ... 
ద‌ర్శ‌కుడు బాలు మాట్లాడుతూ - `` మ‌హాన‌గ‌రంలో నివ‌సిస్తూ స్వ‌తంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం. త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ నలుగురు అమ్మాయిలుగా న‌టిస్తున్నారు.  కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో క‌థానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి`` అన్నారు. 
నిర్మాత హిమబిందు వెల‌గ‌పూడి మాట్లాడుతూ - ``హైద‌రాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రిలో గోవాలో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీక‌రిస్తాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు. 
త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ర‌ఘుకుంచె, సినిమాటోగ్ర‌ఫీ:  శేఖ‌ర్ గంగ‌మోని, పాట‌లు:  భాస్క‌ర భ‌ట్ల‌, ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిటింగ్‌:  నాగేశ్వ‌ర్ రెడ్డి, పి.ఆర్‌.ఒ: ఫ‌ణి - నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విక్కీ రొల‌ర్ కొస్ట‌ర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌:  సాయికుమార్ పాల‌కూరి, స‌హ నిర్మాత‌లు:  రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి, నిర్మాత‌:  హిమ బిందు వెల‌గపూడి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  బాలు.