రెండు సినిమాలు ప్లాప్

Published on Feb 14,2019 04:07 PM

ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ కాగా ఆ రెండు చిత్రాలు కూడా డబ్బింగ్ చిత్రాలు కావడం విశేషం . తమిళ హీరో కార్తీ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన దేవ్ చిత్రం , ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే కూడా ఈరోజు రిలీజ్ అయిన వాటిలో ఉన్నాయి . ప్రియా ప్రకాష్ వారియర్ కొంటెగా కన్ను గీటుతూ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది . దాంతో లవర్స్ డే చిత్రానికి బాగానే హైప్ వచ్చింది . 

ఇక కార్తీ చిత్రం దేవ్ పై మొదటి నుండి పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి దాంతో ఈరోజు రిలీజ్ అయిన ఈ రెండు చిత్రాలకు ఆదరణ లేకుండా పోయింది . దేవ్ చిత్రం కథ , కథనం ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులు పట్టించుకున్న పాపాన పోలేదు . ఇక ప్రియా ప్రకాష్ వారియర్ సినిమా కదా అని వెళితే అది కూడా కథ , కథనం మరీ దారుణంగా ఉండటంతో లవర్స్ డే కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది .