ప్లాప్ మూటకట్టుకున్న బాలయ్య

Published on Dec 21,2019 09:09 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం విడుదల అయ్యింది అయితే ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బాలయ్య అభిమానులకు తప్ప మిగతా ప్రేక్షకులకు నచ్చడం మాత్రం కష్టమే అని తేల్చేసారు. తమిళ దర్శకులు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. డిసెంబర్ 20 న విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చేసింది.

బాలయ్య డిఫరెంట్ గెటప్ బాలయ్య అభిమానులను విశేషంగా అలరించేలా ఉంది అయితే పోలీస్ గెటప్ పై మాత్రం విపరీతమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాలయ్య అభిమానులు. బాలయ్య అభిమానులు మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా బాలయ్య గెటప్ పై ట్రోల్ చేస్తున్నారు. ఫస్టాఫ్ ని బాగానే హ్యాండిల్ చేసిన దర్శకులు కె ఎస్ రవికుమార్ సెకండాఫ్ ని మాత్రం ఆస్థాయిలో చిత్రీకరించలేక పోయారు. ఎన్టీఆర్ బయోపిక్ తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బాలయ్య మరోసారి రూలర్ తో మరో ప్లాప్ అందుకున్నాడు. మొత్తానికి రూలర్ బాక్సాఫీస్ ని రూల్ చేయలేకపోయాడు.