హమ్మయ్య ! మొత్తానికి నిఖిల్ సేఫ్ అయ్యాడు

Published on Dec 14,2019 05:15 PM

హమ్మయ్య ! మొత్తానికి హీరో నిఖిల్ సేఫ్ అయ్యాడు. నిఖిల్ సేఫ్ అవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈ హీరో నటించిన చిత్రం అర్జున్ సురవరం నవంబర్ 29 న విడుదలైన విషయం తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసారు. నిఖిల్ హీరోగా నటించగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. నవంబర్ 29 న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు దాంతో ఈ సినిమా హిట్ అవ్వడం కష్టమే అనుకున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అర్జున్ సురవరం 9 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రాన్ని 7. 50 కోట్లకు థియేట్రికల్ రైట్స్ ని అమ్మారు కాగా ఇప్పుడు 9 కోట్లకు పైగా షేర్ వచ్చింది దాంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు అందరూ సేఫ్ అయ్యారు ఒక్క ఓవర్ సీస్ బయ్యర్ తప్ప. రెండు తెలుగు రాష్ట్రాలలో బయ్యర్లు సేఫ్ కావడంతో నిఖిల్ కూడా సేఫ్ అయినట్లే! నిఖిల్ కు గతకొంత కాలంగా సక్సెస్ లేక చతికిలబడ్డాడు. కట్ చేస్తే అర్జున్ సురవరం ఏడాది కాలంగా విడుదల కాకుండా పలు ఇబ్బందులను పెట్టి చివరకు ఎలాగోలా విడుదలై మంచి వసూళ్ళని సాధించి నిఖిల్ ని ఒడ్డున పడేలా చేసింది.