హమ్మయ్య ! హాట్ భామకు ఛాన్స్ వచ్చింది

Published on Nov 09,2019 11:18 AM

హాట్ భామ నిధి అగర్వాల్ గతకొంత కాలంగా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నప్పటికీ పెద్దగా ఛాన్స్ లు అయితే రావడం లేదు. పైగా రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ నిధి అగర్వాల్ కు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు దాంతో కొంత నిరాశలో ఉన్న ఈ భామకు ఓ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ సినిమా రేపు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి కి ఛాన్స్ అంటే లక్కీ అనే చెప్పాలి ఎందుకంటే మహేష్ మేనల్లుడు హీరో కదా !