ఆర్మీ కి సెల్యూట్ అంటున్న స్టార్స్

Published on Feb 27,2019 10:26 AM

భారత వాయుసేన కు ఫిలిం స్టార్ లు సెల్యూట్ చేస్తున్నారు . పుల్వామా దాడులకు ప్రతీకారం తీర్చుకున్న వాయుసేన కు భారత ఆర్మీ కి భారత ప్రజలు జేజేలు పలుకుతున్నారు . ఈరోజు తెల్లవారు ఝామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిభిరాలపై ఈ దాడులు జరిగాయి . కేవలం 29 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ని ముగించారు భారత  వాయుసేన . 

ఈ దాడిలో 200 మంది నుండి 300 మంది ఉగ్రవాదులు  వరకు చనిపోయినట్లు  తెలుస్తోంది . పుల్వామా దాడి తర్వాత సరిగ్గా 12 రోజుల్లోనే ఈ దాడి జరగడంతో భారతీయులు గర్వంగా ఫీలౌతున్నారు . ఇక ఫిలిం స్టార్స్ అయితే జవాన్ల ధైర్యసాహసాలకు జేజేలు పలుకుతున్నారు . ఎన్టీఆర్ , రాంచరణ్ , అఖిల్ , ఎస్ ఎస్ రాజమౌళి , మహేష్ బాబు లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ చేసారు భారత ఆర్మీ కి మద్దతుగా .