హీరోయిన్ వల్ల శత్రువులైన హీరోలు

Published on Dec 12,2019 04:56 PM

ఒక్క హీరోయిన్ వల్ల ఇద్దరు హీరోలు బద్ద శత్రువులుగా మారారు. కట్ చేస్తే ఆ ఇద్దరు హీరోలలో ఎవ్వరిని కూడా ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదు మరో హీరోని పెళ్లి చేసుకొని ఆ ఇద్దరు హీరోలకు షాక్ ఇచ్చింది. ఈ సంఘటన జరిగింది ఇప్పుడు కాదు సుమా ! 15 సంవత్సరాల క్రితం.  ఇంతకీ ఆ హీరోయిన్ , హీరోలు ఎవరో తెలుసా ....... ఐశ్వర్యారాయ్ , సల్మాన్ ఖాన్ , వివేక్ ఒబెరాయ్ , అభిషేక్ బచ్చన్. మొదట సల్మాన్ - ఐశ్వర్యారాయ్ లు ప్రేమించుకున్నారు అయితే కొన్నాళ్ల ప్రేమ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి దాంతో సల్మాన్ కు బ్రేకప్ చెప్పి వివేక్ ఒబెరాయ్ ని ప్రేమించింది.

అయితే తనని కాదని వివేక్ ని ఐశ్వర్యారాయ్ ప్రేమిస్తుండటంతో ఆగ్రహించిన సల్మాన్ వివేక్ ఒబెరాయ్ కి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట అంతేకాదు బండబూతులు తిట్టాడట. దాంతో భయపడినపోయిన వివేక్ ఒబెరాయ్ మరుసటి రోజే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సల్మాన్ ఖాన్ పై ఆరోపణలు చేసాడు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. కట్ చేస్తే సల్మాన్ కు వివేక్ ఒబెరాయ్ భయపడటంతో చేసేది లేక అతడికి బ్రేకప్ చెప్పి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుంది ఐశ్వర్యారాయ్. ఈ భామ వల్ల ఇద్దరు హీరోలు కొట్టుకుంటే మధ్యలో అభిషేక్ వశం అయ్యింది దాంతో ఇద్దరు కూడా ఖంగుతిన్నారు పాపం.