బెడ్ సీన్ లో నటించి తప్పు చేసానని బాధపడుతున్న భామ

Published on Apr 29,2020 06:04 PM
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ తో కలిసి బెడ్ సీన్ లో హద్దులు చెరిపేసి నటించి తప్పు చేసానని ఇప్పుడు బాధపడుతోంది హీరోయిన్ రాశి ఖన్నా. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నలుగురు హీరోయిన్ లు కాగా అందులో రాశి ఖన్నా పాత్ర కీలకం అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో రాశి ఖన్నా తన హద్దులు చెరిపేసి శృంగార సన్నివేశాల్లో నటించింది. అలాంటి సీన్ లలో రాశి ఖన్నాని చూసి చాలామంది షాక్ అయ్యారు.

ఇక ఆ సీన్ చేసేప్పుడు విజయ్ దేవరకొండ సలహా ఇచ్చాడట కూడా. నాకంటే ఇదే రకమైన ఇమేజ్ ఉంది మరి నీకు అలాంటి ఇమేజ్ లేదు కాబట్టి ఒకసారి ఆలోచించుకో అని చెప్పాడట కూడా. అయితే ఒపుకున్నాక తప్పుతుందా ? అని చేసిందట. అయితే తీరా సినిమా విడుదల అయ్యాక నెగెటివ్ కామెంట్స్ వచ్చాయట ! అందుకే ఇకపై పాత్రలను ఎంచుకునేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటానని అంటోంది రాశి ఖన్నా. ప్రస్తుతం ఈ భామ చేతిలో పెద్దగా సినిమాలు లేవు దాంతో ఈ వైరాగ్యం పాపం.