మీద పడి చీర లాగేశారట

Published on Dec 11,2019 02:49 PM

మేడం మీ అభిమానులం అంటూ పెద్ద ఎత్తున వచ్చిన గుంపు మీదపడి నా చీర ని లాగేశారని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది టివి నటి శ్వేతా తివారి. ఉత్తరాదిన బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న భామ ఈ శ్వేతా తివారి. సీరియల్ నటి అయినప్పటికీ ఉత్తరాది భామలకు మంచి క్రేజ్ ఉంటుంది. దాంతో వాళ్ళని ప్రేక్షకులు కూడా బాగానే గుర్తుపడతారు కూడా. బుల్లితెర లో నటిస్తున్నప్పటికీ హీరోయిన్ లకు సమానంగా తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది వీళ్లకు దాంతో రాయ్ పూర్ లో ఒక ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పిలిచారట శ్వేతా తివారి ని.

ఈవెంట్ అందునా రాయ్ పూర్ కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ అవసరం లేదులే  అనుకొని వెళ్లిందట. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పెద్ద ఎత్తున కుర్రాళ్ళు మీదపడి సెల్ఫీ లు తీసుకుంటూ , షేక్ హ్యాండ్స్ ఇస్తూ నానా గందరగోళం చేశారట. ఈలోపు కొంతమంది ఆకతాయిలు మీద పడి తన చీరని లాగేస్తున్నారట దాంతో నిలువెల్లా భయంతో వణికిపోయిందట. సరిగ్గా అదే సమయంలో కొంతమంది తనకు రక్షణగా నిలిచారని వాళ్ళ సహాయంతో స్టేజ్ మీదకు వెళ్లానని అయితే అది నాకు పెద్ద గుణపాఠాన్ని నేర్పిందని అంటోంది శ్వేతా తివారి. నిజమే అభిమానులం , సెల్ఫీ లు అంటూ కొంతమంది ఇలాంటి వేషాలు వేస్తూ సెలబ్రిటీ లను ఇబ్బందుల పాలు చేస్తున్నారు.