ఫ్యాన్స్ ని భయపెడుతున్న బాలయ్య కొడుకు ఫోటో

Published on Nov 30,2019 12:20 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తాజా లుక్ నందమూరి అభిమానులను భయపెడుతోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా గుంటూరు వెళ్ళాడు అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దిగిన ఫోటోలలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న మోక్షజ్ఞ లుక్ బాలయ్య అభిమానులను అలాగే నందమూరి అభిమానులను తీవ్రంగా భయపెడుతోంది.

ఇంతకీ ఈ లుక్ లో మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో తెలుసా ..... కాస్త బొజ్జ కూడా వచ్చింది దాంతో హీరో కావాల్సిన వాడు ఇలా ఉన్నాడు ఏంటి చెప్మా ? అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. గతకొంత కాలంగా వినబడుతున్నది నిజమే అని ఈ లుక్ ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే మోక్షజ్ఞ కు సినిమాల్లో నటించడం ఇష్టం లేదు అనేది సారాంశం అందుకే కాబోలు ఇలా కాస్త లావయ్యాడు అలాగే బొజ్జ కూడా స్పష్టంగా కనిపిస్తోంది మరి.