తాప్సీ నడుముపై చేయి వేసి నొక్కాడట

Published on Jan 31,2020 05:31 PM

నా నడుముపై చేయి వేసి ఓ అపరిచితుడు నొక్కడంతో అతడి వేలు విరిచేసానని అంటోంది ఫైర్ బ్రాండ్ గా మారిన తాప్సీ. ఇటీవల తిరుమలకు దర్శనం కోసం వెళ్లిన సమయంలో తన వెనకాల ఓ అపరిచుతుడు ఉన్నాడట. అయితే తనకు నాకు చాలా గ్యాప్ ఉన్నప్పటికీ నన్ను తాకాలనే దురుద్దేశంతో నా దగ్గరకు వచ్చి నా నడుముపై చేయి వేసి నొక్కాడని అందుకే అతడికి తగిన బుద్ది చెప్పానని అంటోంది తాప్సీ.

నడుముపై చేయి వేసిన వ్యక్తి చేయి వేలు విరగ్గొట్టిందట తాప్సీ. తాజాగా ఈ భామ శభాష్ మిథు అనే బయోపిక్ లో నటించడానికి సిద్ధం అవుతోంది. నిన్ననే శభాష్ మిథు చిత్రంలోని ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. తాప్సీ లుక్ కి విపరీతమైన స్పందన వస్తోంది. ఇక మిథాలీ రాజ్ అయితే తాప్సీ లుక్ కి ఫిదా అయిపొయింది. తాప్సీ ని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్లు ఉందని సంతోషపడుతోంది మిథాలీ రాజ్.