బూతుల ట్రైలర్ ఫలక్ నుమా దాస్

Published on Feb 14,2019 12:29 PM

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఫలక్ నుమా దాస్ . కరాటే రాజు నిర్మిస్తున్న ఈ ఫలక్ నుమా దాస్ చిత్రంలో పెళ్లిచూపులు దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ కూడా కీలక పాత్రలో నటించాడు . కాగా నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఫలక్ నుమా దాస్ ట్రైలర్ కి స్పందన బాగా వస్తోంది . 

ఎందుకంటే ఈ ట్రైలర్ లో బూతులు బాగానే ఉన్నాయి . సినిమా వ్వవహారం చూస్తుంటే కామన్ గా మాట్లాడుకునే బూతులు అన్నీ పెట్టేసారు సినిమాలో . అయితే ఈ బూతులను సెన్సార్ వాళ్లు ఒప్పుకుంటారా ? అన్నది చూడాలి . విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా మెగా ఫోన్ పట్టి  దర్శకత్వం కూడా చేపట్టాడు . పక్కా హైదరాబాదీ స్లాంగ్ లో తెరక్కేక్కిన ఈ చిత్రం పై ఆ చిత్ర బృందం చాలా ఆశలే పెట్టుకున్నారు . 

ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి