నకిలీ విజయ్ దేవరకొండ అరెస్ట్

Published on Mar 07,2020 01:09 PM

విజయ్ దేవరకొండకున్న క్రేజ్ ని తన తెలివి తేటలతో అమ్మాయిలను మోసం చేయాలనే దురాలోచన చేసాడు ఓ మోసగాడు. దాంతో విజయ్ దేవరకొండ పేరిట నకిలీ ఖాతా సృష్టించి అమ్మాయిలకు వల వేసాడు. ఫేస్ బుక్ లో నిజమైన విజయ్ దేవరకొండ ఖాతా అని భ్రమపడిన అమ్మాయిలు అతడితో చాటింగ్ చేయడం మొదలు పెట్టారు. తమతో చాటింగ్ చేస్తున్నది హీరో విజయ్ దేవరకొండ అని నమ్మిన కొంతమంది మోసపోయారు.

ఈ విషయం హీరో విజయ్ దేవరకొండకు తెలియడంతో ప్లాన్ వేసి ఆ మోసగాడిని అరెస్ట్ చేసేలా చేసాడు. నకిలీ విజయ్ దేవరకొండ ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. యితడు బాన్స్ వాడకు చెందిన వాడు. విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన క్రేజ్ ఉండటంతో అతడి పేరున మోసం చేయొచ్చని ప్లాన్ చేసాడు. ఇలా ఎవరెవరిని మోసం చేసాడో లెక్క తేల్చే పనిలో పడ్డారు సైబర్ క్రైమ్ పోలీసులు.